Narendra Modi: సుప్రీంకోర్టు తీర్పు ప్రతిపక్షాలకు చెంపపెట్టు: మోదీ

  • ఈవీఎం ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో క్రాస్ చెక్ చేయడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
  • ప్రజాస్వామ్యానికి ఇది గొప్ప రోజన్న మోదీ
  • ఈవీఎంలపై ప్రతిరోజు విమర్శలు చేస్తున్నారని విమర్శ
Modi on supreme court verdict on EVM

ఈవీఎంలలో పోలైన మొత్తం ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో క్రాస్ చెక్ చేయడానికి నిరాకరిస్తూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీ స్పందిస్తూ... సుప్రీంకోర్టు తీర్పు ప్రతిపక్షాలకు చెంపపెట్టు అని అన్నారు. సుప్రీం తీర్పుతో దేశ ప్రజలకు కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈవీఎంలపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ కు ఇది చెంప దెబ్బ అన్నారు. ప్రజాస్వామ్యానికి ఈరోజు గొప్ప రోజని చెప్పారు.

ఈవీఎంలపై విపక్షాలు స్వార్థ ప్రయోజనాల కోసం ప్రతి రోజూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బ్యాలెట్ బాక్సులను దోచుకోవాలని కలలు కంటున్న వారి కుట్రలకు సుప్రీంకోర్టు తీర్పుతో పెద్ద దెబ్బ తగిలిందని అన్నారు. బీహార్ లోని అరారియాలో బహిరంగ సభలో ప్రసంగిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ హిందువుల పట్ల పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తోందని మోదీ మండిపడ్డారు. మన దేశంలోని వనరులపై తొలి హక్కు పేదలదేనని చెప్పారు. ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీల హక్కులను హరించడానికి కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని విమర్శించారు.

More Telugu News